calender_icon.png 16 March, 2025 | 8:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ కేసులో పట్టుబడితే ఆ ఇంటికి కరెంట్, నీరు బంద్

16-03-2025 01:55:36 AM

  1. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రత్యేక దృష్టి
  2. డ్రగ్స్ రహిత తెలంగాణే రాష్ట్రప్రభుత్వ ధ్యేయం
  3. కొత్తగూడెం, ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కృషి 
  4. అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిని ఇండ్లకు విద్యుత్, నీటి స రఫరా నిలిపివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు లేవనెత్తిన అనే అంశాలపై సీఎం మాట్లాడారు. అనేక ప్రశ్నలకు స మాధానమిచ్చారు.

రాష్ట్రంలో డగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని, డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అందుకుగాను ఇప్పటికే టీజీ న్యాబ్‌కు రూ.250 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. డ్రగ్స్ విక్రయాలపై పటిష్ట నిఘా పెట్టామని, దీనిలో భాగంగానే ఫౌంహౌస్‌లపైనా దాడులు చేయిస్త్తున్నామని వివరించారు.

పాఠశాలల పరిసరాల్లో గంజా యి, డ్రగ్స్ విక్రయించినట్లు తేలితే ఆయా పాఠశాలల యాజమాన్యాలపై కేసులు పెడతామని హెచ్చరించా రు. ప్రతి ప్రైవేట్ పాఠశాలలో యాజమాన్యం మానసిక నిపుణుడిని నియమించాలని, తద్వారా విద్యార్థుల ప్రవర్తనను గమనించాలని ఆదేశించారు.

హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు పాఠశాలల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి, డ్రగ్స్ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కేదార్ పోస్టుమార్టం రిపోర్టు తెలంగాణకు తెప్పిస్తున్నామని, రిపోర్ట్‌ను త్వరలోనే సభ ముందుం ఉంచుతామని సీఎం వెల్లడించారు.

డ్రగ్స్ మహమ్మారి హైదరాబాద్‌ను పీడి స్తున్నదని, డ్రగ్స్‌ను హైదరాబాద్ నుంచి పారద్రోలడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.

రోజుకు 1,600 వాహనాలు..

హైదరాబాద్ నగరంలో రోజుకు 1,600 కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయని, ఇంట్లో ఉండే నలుగురు, నా లుగు వాహనాల్లో ప్రయాణిస్తు న్నారని సీఎం వాపోయారు. సింగపూర్ వంటి దేశాల్లో కొత్త వాహనం కొనుగోలు చేయాలంటే, ముందు గా పాతవాహనాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుందన్నారు.

అమెరికా, లండన్‌లో ఎంత ధనవంతులైనా రైల్వేస్టేషన్లలో తమ వాహనాలు పార్క్ చేసి, రైళ్లలో తమ గమ్యస్థానాలకు చేరుకుంటారని సభ దృష్టికి తీసుకొచ్చారు. విదేశాల్లో నలుగురు ఉద్యోగులు కలిసి ఒకే కారులో ఆఫీసులకు వెళ్తారన్నారు. హైదరాబాద్‌లోనూ ఏదో ఒక మార్గం అన్వేషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నగరం పరిధిలోని ఇండస్ట్రీ కారిడార్‌ను ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలిస్తే గానీ కాలుష్యాన్ని నివారించలేమని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఎన్ని విమానాశ్రయాలొస్తే, రాష్ట్రం అంత అభివృద్ధి చెందుతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

ఇప్పటికే తాము మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి మార్గం సుగమం చేశామని, అలాగే కొత్తగూడెం, ఆదిలాబాద్‌లోనూ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

లాల్ దర్వాజ టెంపుల్ అభివృద్ధికి రూ.20 కోట్లు..

హైదరాబాద్‌లోని లాల్ దర్వాజ టెం పు ల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎం ఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రభుత్వాన్ని కోర గా..  సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఆల య అభివృద్ధి పనులకు తక్షణమే సీఎం ఫండ్ నుంచి తక్షణం రూ.20 కోట్లు మంజూ రు చే స్తామని అప్పటికప్పుడే ప్రకటించారు. పాతబస్తీ అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సలహాలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.