calender_icon.png 11 October, 2024 | 10:58 AM

పిలిస్తే.. పలుకుతా

11-10-2024 12:32:31 AM

పేదలకు ఆపన్నహస్తం అందిస్తున్న బండారి గంగాధర్

సేవా కార్యక్రమాలతో గుర్తింపు

శివంపేట, అక్టోబర్ 10: మెదక్ జిల్లా శివంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన బండారి గంగాధర్ నిరుపేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదగారు. ప్రజా సేవలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటూ ఎందరో నిరుపేద మహిళల జీవితా ల్లో వెలుగులు నింపేలా ఇతోధికంగా సహాయం అందిస్తున్నారు.

ఇప్పటివరకు ఆయన శివంపేట మండలంలో సుమారు 100 మంది మహిళల పెళ్లిళ్లకు పుస్తె, మట్టెలను కానుకగా అందించారు. అలాగే పిల్లుట్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో సొంత డబ్బులతో వలంటీర్లను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా కృషి చేస్తున్నారు.

శివంపేట మండలంతో పాటు నర్సాపూర్ నియోజకవర్గంలో దేవాలయాలకు తనవంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తు న్నారు. క్రీడా రంగంలోనూ రాజకీయాలకు అతీతంగా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నాడు. పేద ప్రజలకు ఏ ఆపద వచ్చినా.. పిలిస్తే పలుకుతా అంటూ అభయహస్తం అందిస్తున్నారు. అతను చేస్తున్న సామాజిక సేవలకు గాను ప్రభుత్వం ఇప్పటికే పలు అవార్డులను ప్రదానం చేసింది.