calender_icon.png 29 April, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ జనతా గ్యారేజ్ అయితే.. కేటీఆర్ ప్రతినాయకుడా?

25-04-2025 02:27:01 AM

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ 

హైదరాబాద్, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ జనతా గ్యారెజ్‌లో కేటీఆర్ ప్రతినాయకుడా(విలన్)? అం టూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. జనతా గ్యారేజ్  చిత్రంలో గ్యారేట్ యజమాని మోహన్‌లాల్ కొడుకు విలనేనని అద్దంకి గుర్తు చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మా ట్లాడుతూ ఏదై నా విషయంపై మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మా ట్లాడాలని హిత వు పలికారు.

హెచ్‌సీయూ విషయంలో కేటీఆర్ ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే ప్రధాని మోదీ మాట్లాడుతు న్నార ని మండిపడ్డారు. మంత్రులు ఖర్చులు తగ్గించుకో వడానికే హెలికాప్టర్‌లో వెళ్తున్నారని తెలిపారు. కాన్వాయ్‌కి అయ్యే ఆర్థిక భారం కంటే తక్కువగానే అవుతుందని చెప్పారు.

బీఆర్‌ఎస్ నేతలకు ఉన్నట్టు తమకు సొంత హెలికా ప్టర్లు లేవన్నారు. కాళేశ్వరాన్ని చూసేం దుకు కూడా ఆఫీసర్లు, విజిటర్లకు హెలికాప్టర్ పెట్టలేదన్నారు. సుదూర ప్రాంతా లకు వెళ్లిరావడం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లోనే మంత్రులు హెలి కాప్టర్లు వాడుతు న్నారని, మీలాగా విలాసాలకు హెలికాప్టర్లు వాడలేదన్నారు. 

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిక 

పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్‌లో చేరా రు. వీరికి పీసీసీ అధ్య క్షుడు మహేశ్ గౌడ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానిం చారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.