calender_icon.png 17 October, 2024 | 2:49 PM

బీపీ రోగులు కాఫీ తాగితే!

28-09-2024 12:00:00 AM

ఆఫీసులో పని చేస్తున్నప్పుడు ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు వెంటనే కాఫీ తాగేస్తుంటారు చాలామంది. వేడి వేడి కాఫీ శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది. అయితే కాఫీని రోజులో ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యల బారినపడేలా చేస్తుందట. ఎవరైనా ఒక రోజులో 6 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరమని సౌత్ ఆస్ట్రేలియా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో తేలింది.

అయితే ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 22% పెరుగుతుంది. ఇక అధిక బీపీ రోగులకు కాఫీ ప్రమాదం కూడా. అటువంటి పరిస్థితిలో ఒక రోజులో ఎన్ని కప్పుల కాఫీ తాగాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. 

అయితే రక్తపోటుతో తరచుగా బాధపడేవారు వీలైనంతవరకు కాఫీకి దూరంగా ఉండాలని చెబుతున్నారు. అధిక రక్తపోటు ఉన్నవారు ఎప్పుడూ కాఫీ తాగకూడదు. ఇది శరీర వ్యవస్థలలో సమస్యను పెంచుతుంది. కెఫిన్ శరీరంలోకి ప్రవేశిస్తే హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత రెండూ పెరుగుతాయి.

ఇది రక్తపోటును పెంచవచ్చు. అంతేకాదు, డీహైడ్రేషన్, అధిక మూత్రవిసర్జన, తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అధిక రక్తపోటు ఉన్న రోగులు రోజుకు 1 లేదా 2 కప్పుల కాఫీ మాత్రమే తాగాలి. కాఫీ తాగడమే కాకుండా వ్యాయామం, హైడ్రేషన్ విషయంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. వీలైతే.. వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే కాఫీ తాగండి.