హీరోయిన్ అనగానే అందాల మినిమం గ్లామర్ ఆశించే ప్రేక్షకులెందరో! ఎందుకంటే.. చీరకట్టు నుంచి బికినీ ధరించటం వరకు, ముద్దు నుంచి లిప్‌లాక్ వరకు, రొమాన్స్ నుంచి బోల్డ్ సీన్ల వరకు అందాల ఆరబోతను హద్దులు దాటించే హీరోయిన్ల భవితవ్యాన్ని నిర్ణయించాల్సింది కూడా ఆ ప్రేక్షకులే కాబట్టి! అయితే తమకంటూ కొన్ని హద్దులు పెట్టుకున్న హీరోయిన్ల జాబితాలో ఐశ్వర్య మీనన్ పేరు నూ చేర్చేయవచ్చు. ఎందుకంటే.. ఐశ్వర్య మీనన్ ఇటీవల అభిమానులతో సోషల్ మీడియా వేదికగా సాగించిన చిట్‌చాట్‌లో అభిమానికి ఇచ్చిన సమాధానమే ఇందుకు కారణం.
‘నిన్ను బికినీలో చూడాలని ఉంది’ అన్న ఓ అభిమానికి ఇలా సమాధానమిచ్చింది.. ‘చీరలో నేను అందంగా, సహజ సిద్ధంగా కనిపి స్తాను. చీరకట్టు నాకు చాలా బాగా నప్పుతుంది. గ్లామర్‌గా కనిపించడం నాకు ఇష్టమే కానీ, గ్లామర్ ముసుగులో బికినీ మాత్రం వేసుకోలేను. నేను జీవితంలో అసలే బికినీ ధరించను. నన్ను బికినీలో చూడాలని ఎవరైనా ఆశ పడితే, ఆ కోరిక నెరవేరదు’ అని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఐశ్వర్య మీనన్ పెళ్లి ముచ్చట కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుతం కెరీర్‌ను ఎంజాయ్ చేస్తున్నానని, మరికొన్నేళ్లపాటు పెళ్లి చేసుకోవటం లేదని కూడా తెలిపిందీ ఆకట్టుకునే శరీర సౌష్ఠవ ‘ఐశ్వర్య’ం కలిగిన సుందరాంగి.