calender_icon.png 8 February, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవకాశం చేజారితే మళ్లీ రాదు

29-01-2025 12:00:00 AM

కాలశ్చ సకృదభ్యేతి యం 

నరం కాల కాఙ్ క్షిణమ్ 

దుర్లభః స పునస్తస్య 

కాలః కర్మ చికీర్షతః॥

ఙూ కౌటిలీయం (-5)

“కాలం కోసం వేచి ఉన్న మనిషికి అది జీవితంలో ఒకమారే లభిస్తుంది. లక్ష్యాన్ని సాధించాలనుకునే వారికి అవకాశం మరొకమారు లభించదు” అంటా డు ఆచార్య చాణక్య. కాలమంటే అవకాశం. కార్యాన్ని సాధించాలని తపించే నాయకుడు ఎదురైన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలి.

వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే మరొక అవకాశం కోసం ఒక్కోసారి జీవితకాలం ఎదురుచూడాలి రావచ్చు. అవకాశం ఒకమారు తలుపు తడుతుంది. చైతన్యశీలియై తలుపులు తెరిస్తే వరిస్తుంది. సోమరియై తలుపులు తెరవకపోతే పక్కకు వెళుతుంది.

ఒక పబ్లిక్ రంగ సంస్థలో గుమాస్థాగా చేరిన చిరుద్యోగి ఒకరా సంస్థలో ఆర్థిక నిర్వహణాధికారిగా పద వీవిరమణ చేసారు. తన 36 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో 13 పదవీ ఉన్నతులు పొంది తర్వాతి తరానికి ఆదర్శప్రాయుడయ్యాడు. ఉన్నతాధికారుల వద్ద పని సంస్కృతిని నేర్చుకున్నాడు. అనుయాయులకు చేయూతనిచ్చి వారు నాయకత్వ లక్షణాలను పెంచుకునేందుకు ప్రేరణ నిచ్చాడు. దానికి అతనికి దో హదపడిన అంశాలలో ప్రథమమైంది, వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవడం.

అలాగే, విద్యార్హతలను ఉన్నతీకరించుకోవడం, ఇచ్చిన ప్రతి బాధ్యత నూ నిబద్ధతతో సమర్థవంతంగా నిర్వహించడం, జ వాబుదారీ తనానికి ప్రతిరూపంగా పనిచేయడం. నిరంతరం మారుతున్న సాంకేతిక మార్పులను అన్వయించుకుంటూ పని విధానాన్ని సులువు చేసుకోవ డంలో కొత్త మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సా గడం, ముఖ్యంగా అప్పగించిన పని ప్రయోజనాన్ని అంతిమ ఫలితాన్నీ ముందుగా అవగాహన చేసుకోవడం, తన బృందానికి అవగాహన చేయించడం..

ఇలాంటి వాటివల్ల తాను విజయం సాధించడమేకాక సంస్థలో ఒక ఉత్తమ సంస్కృతిని ప్రవేశపెట్టిన వాడయ్యాడు. బాధ్యతను తీసుకున్న నాయకుడు తనను తాను నిరూపించుకోవాలి. ప్రతి సంస్థలో ఒక పని సంస్కృతి ఉంటుంది. దానిని ఆధునీకరించాల్సిన అ వసరం ఉందా? ఉంటే ముందుగా కార్య స్వరూప స్వ భావాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలి.

ఎదురయ్యే అడ్డంకులు, అవకాశాలపై స్పష్టమైన అవగాహ న పెంచుకోవాలి. ఉదాత్తమైన లక్ష్యాన్ని సాధించాలనే నాయకుడు ఎంతటి శక్తివంతుడైనా అన్ని పనులను తానే నిర్వహించలేడు. తన కార్యసాధనలో సహాయ పడేందుకు సమర్థవంతమైన బృందాలను ఏర్పరచడం, వాటిని ప్రభావవంతంగా పని చేయించడం అవసరం. ఆ ప్రక్రియలో అర్హత కలిగిన అనుచరులకు నాయకులుగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించాలి.

తన బృందంలోని సభ్యుల బలాలు, బలహీనతలను గురించి సమగ్రమైన అవగాహనను కలిగి వుండాలి. తమ ముందున్న లక్ష్యం ఏమిటో, అందులో ఎదురయ్యే సమస్యలు ఎలాంటివో, దానిని సాధించడం ద్వారా సభ్యులకు కలిగే ఫలితం ఎలాంటిదో, సంస్థకు కలిగే లాభం ఎంతటిదో స్పష్టంగా చర్చించాలి.

నిబద్ధత కలిగిన అనుయాయులను సమావేశ పరచి వారి కి సమున్నతమైన సవాళ్ళను ఏర్పరచాలి. వాటిని అధిగమించే క్రమంలో సృజనాత్మక ఆలోచనలను చేయాలి. వాటిని ఆచరణలో పెట్టేందుకు మార్గాలను అన్వేషించడమూ అవసరం.

నాయకుడు సలహాలివ్వడం, మార్గదర్శనం చే యడం సమంజసమే కాని కార్యనిర్వహణ బాధ్యతను పూర్తిగా సహాయకులకే అప్పగించాలి. లక్ష్యం ఏమిటి, దాన్ని సాధించేందుకు మార్గాలు, వాటిలో ఉత్తమమై న దానిని ఎన్నుకొని దాని సాఫలత్యకు కాలావధి ఎంత, కనీస వనరులతో దానిని నిర్వహించడం ఎ లా? సహచరుల నైపుణ్యాలు, అనుభవం ఎంతవరకు ఉపయుక్తమవుతాయి, పరిస్థితులను ఎలా ఎదుర్కోవడం వంటివన్నీ స్పష్టంగా చర్చించాలి.

సంస్థలోని వివిధ విభాగాధిపతులతో బృందాన్ని ఏర్పరచి వారి అనుభవాలను ఉద్యోగులకు అందించాలి. ప్రతి రోజూ వివిధ విభాగాధిపతులతో ఆ రోజు పూర్తి చే యాల్సిన లక్ష్యాలను చర్చించి, సాయంత్రం వాటిని సమీక్షించుకో వాలి. దీనివల్ల కార్యస్వరూపంపై స్పష్టమైన, సమగ్రమైన అవగాహన కలగడమేకాక ఎక్కడ ఏ విధమైన ప్రతిష్ఠంభన ఏర్పడినా దానిని సరిచేసే అవకాశమూ ఉంటుంది. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం ఏర్పడితే సరిచేసే అవకాశమూ కలుగుతుంది.

అన్నింటికన్నా ముఖ్యంగా చేస్తున్న పని కి, దానికి పొందుతున్న ప్రతిఫలానికి మధ్య అంతరం తగ్గితే అది అసంతృప్తికి కారణమతుంది. ఆర్థిక మూ లాలు బలపడితేనే సంస్థకు, పనిచేసే ఉద్యోగులకు ఉ నికి, అభివృద్ధి ఉంటాయి. అంచనాలకు, యదార్థ స్థితి కీ మధ్య అంతరం అధికంగా ఉంటే నాయకత్వం బలహీనమైందనే భావించాల్సి వస్తుంది. ఉత్పత్తుల నా ణ్యతను పెంచలేని సంస్థ వినియోగదారులను ఆకర్షించలేదు. విపణివీధిలో నిలదొక్కుకోలేదు.

ప్రతి వి భాగపు పనితీరుకు సంబంధించిన నివేదికను నాయకుడు పరిశీలిస్తేనే సరైన మార్గదర్శనం చేయగలుగు తాడు. మేధోమథన సమావేశాలను నిర్వహిస్తూ సం స్థ ఉన్నతికై సూచనలు, సలహాలను ఉద్యోగుల నుంచి ఆహ్వానించాలి. ఫలితంగా ప్రతి ఉద్యోగీ సంస్థ తనదనే భావనతో పనిచేస్తాడు. 

వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, సమర్థవంతమైన బృందాలను ఏర్పరచి వాటిని ప్రభావవంతంగా పనిచేయించుకోవడంలోనే నాయకుని ప్రతిభ వెలుగు చూస్తుంది. అలాంటి నాయకుని మార్గదర్శనంలో మరెందరో నాయకులు తయారవుతారు. సంస్థకూడా కల్పవృక్షంగా ఎదుగుతుంది.

- పాలకుర్తి రామమూర్తి