* ఇద్దరు జవాన్లు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
శ్రీనగర్, ఫిబ్రవరి 11: జమ్ముకశ్మీర్‌లోని ఎల్‌ఓసీ సమీపంలో మంగళవారం మధ్యా హ్నం బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అఖ్నూర్ సెక్టార్‌లో 3.30గంటల సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్(ఐఈడీ) పేలినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు జవాన్లను దగ్గరిలోని ఆసు పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కెప్టెన్ హోదా అధికారి సహా మరో జవాను ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు. విధి నిర్వహణలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. ఘటనపై సెర్చ్ ఆపరేషన్ జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పం దించారు. జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. పటిష్ట నిఘా, అత్యాధునిక సాంకేతికతతో ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకోవాలని అధికారులకు సూచించారు.