calender_icon.png 16 April, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఈడీ బాంబుల స్వాధీనం

15-04-2025 12:53:03 AM

గవర్నర్ బీజాపూర్ పర్యటన రద్దు  

భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్న 3 బాటిల్, 2 టిఫిన్ బాంబులు

చర్ల, ఏప్రిల్ 14 (విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు ప్రాంతమైన  చత్తీస్గడ్ రాష్ట్రంలోని  బిజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు సోమవారం ఐఏడి బాం బుల ను స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు  భద్రతా బలగాలే  లక్ష్యంగా చేసుకొని ఐఈడి బాంబులను ఏర్పాటు చేశారు. మావోయిస్టులు  బిజాపూర్ జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంకెలి గ్రామానికి సమీపం లో సీరియల్ ఐఇడి బాంబులను ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసు బలగాలు మూడు సీసా బాంబులను, 2 టిఫిన్ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఐఈ డి బాంబులను బిడిఎస్ జట్టు  నిర్వీర్యం చేసింది . ఐ ఈ డి కలకలంతో ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాల దృష్ట్యా గవర్నర్ రామెన్ డెకా బిజపూర్ పర్యటన రద్దు చేశారు.