జవాన్‌కు తీవ్ర గాయాలు
చర్ల, ఫిబ్రవరి 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల సరిహద్దు రాష్ర్టమైన ఛత్తీస్ గఢ్ రాష్ర్టం దక్షిణ బస్తర్ దంతేవాడ జిల్లా జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని సీఆర్‌పీఎఫ్ 231 బెటాలియన్, భారత వైమానిక దళానికి చెందిన ‘ఎఫ్’ కంపెనీ మంగళవారం ఉదయం మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహించింది.
ఈ ఆప రేషన్ నుండి తిరిగి వస్తుండగా భద్రతా దళాలకు హాని కలిగించే ఉద్దేశంతో మావో యిస్టులు అమర్చిన ప్రెజర్ ఐఈడీ బాంబ్ పేలడంతో సీఆర్‌పీఎఫ్ 231 బెటాలియన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ శుక్లా గాయా లపాలయ్యారు. గాయాపడిన జవాన్ శుక్లాకు ప్రథమ చికిత్స అందించిన తర్వా త, గాయపడిన సైనికుడిని హెలికాప్టర్ ద్వారా తరలించి, తక్షణ సేవలు మెరుగైన చికిత్స కోసం రాయ్‌పూర్‌లోని ఉన్నత కేంద్రానికి తరలించారు