calender_icon.png 31 October, 2024 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇడువని వాన!

21-07-2024 12:54:17 AM

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు

ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

ఏజెన్సీలో ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, ఒర్రెలు

మారుమూల గ్రామాల్లో తెగిన బీటీ రోడ్లు, తాత్కాలిక వంతెనలు

జల దిగ్బంధంలో వందలాది గ్రామాలు  

* బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువగా ఉంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలంలో అత్యధికంగా 146.2 మి.మీ వర్షపాతం నమోదైంది. వరదల ధాటికి ఆయా జిల్లాల్లోని వాగులు, ఒర్రెలు ఉప్పొంగి చప్టాలు, బీటీ రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో వందలాది గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు వరద పోటుకు గోదావరి బేసిన్‌లోని కడెం, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కాళేశ్వరం పరిధిలోని బరాజ్‌లు, కృష్ణాబేసిన్‌లోని నారాయణపుర, ఉజ్జయిని, జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు జలకళను సంతరించుకున్నాయి.

తెలంగాణపై కొనసాగుతున్న అల్పపీడన ప్రభావం

ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలో అతి భారీ వర్షాలు

ఇతర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం

ఏజెన్సీలో ఉప్పొంగి ప్రవాహిస్తున్న వాగులు, ఒర్రెలు

మారుమూల గ్రామాల్లో తెగిన బీటీ రోడ్లు, తాత్కాలిక వంతెనలు

జల దిగ్బంధంలో వందలాది గ్రామాలు  

* బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఫలితంగా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. వానల కారణంగా పట్టణాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో జన జీవనం స్తంభించింది. ఏజెన్సీల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి ధాటికి చప్టాలు, బీటీరోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో పలుచోట్ల వాహన రాకపోకలు స్తంభించాయి. భద్రాద్రి, ఖమ్మం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో వర్ష తీవ్రత ఎక్కువ కనిపించింది.      

విజయక్రాంతి నెట్‌వర్క్, జూలై 20 :

ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వరదలు

మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల అతలాకుతలమవుతున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టు జలక ళను సంతరించుకున్నది. వరద పోటు ఎక్కువగా ఉండటంతో నీటిపారుదలశాఖ అధికా రులు మేడిగడ్డ లక్ష్మీబరాజ్ నుంచి దిగువకు జలాలను వదులుతున్నారు. మేడిగడ్డ బరాజ్‌లోకి శనివారం ఒక్కరోజే 3.75 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరింది. గోదావరి పూష్కర ఘాట్ వద్ద 8.89 మీటర్ల మేర ప్రవహిస్తోంది.

ములుగు జిల్లాలోని సమ్మక్క సాగర్ బరాజ్ నుంచి 4.8 లక్షల క్యూసెక్కుల జలాలు దిగువకు విడుదలయ్యాయి. వానల ధాటికి భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి, టేకుమట్ల మండలాల్లో మానేరు వాగు ఉప్పొం గింది. టేకుమట్ల  రాఘవరెడ్డిపేట గ్రామా ల మధ్య నిర్మించిన తాత్కాలిక మట్టిరోడ్డు కొట్టుకుపోయింది. ములు గు జిల్లా తాడ్వాయి మండలం చినబోయినపల్లి మేయిన్ రోడ్డుపై చెట్లు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మహాముత్తారం, కాటారం, మహాదేవ్‌పూర్, మల్హర్, పలిమెల మండలాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే 

  ఇతర జిల్లాల్లోనూ..

సూర్యాపేట జిల్లాను ముసురు కమ్ముకున్నది. జిల్లాలో సగటు వర్షపాతం 6.8 మి.మీ నమోదైంది. చివ్వెంల మండలంలో అత్యధికంగా 13.8 మి.మీ వర్షపాతం కురిసింది. అనంతరం మూసీ ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని బయటకు వదలాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటు తగిలింది. ప్రాజెక్ట్ నీటి నిల్వసామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 690 అడుగులకు చేరుకున్నది. స్వర్ణ ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 1,183 అడుగులు కాగా, ప్రస్తుత  నీటిమట్టం1,174 అడుగులకు చేరింది. మహబూబ్‌నగర్ జిల్లాలో మోస్తరు వర్షం కురిసింది. జగిత్యాల జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది.

జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినందున కలెక్టర్ బీ సత్యప్రసాద్ కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పర్యటించారు. చెరువులు, వాగుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలో భారీ వర్షం కురిసింది. దీంతో నగర పరిధిలోని భద్రకాళి చెరువు మత్తడి పోస్తోం ది. హనుమకొండ బస్టాండ్ పరిసరాలు వర్షం నీటితో నిండాయి. మహబూబాబాద్ జిల్లాలో కురుస్తున్న మోస్తరు వర్షాలకు చెరువుల్లోకి వరద చేరుతోంది. గార్ల మండలం లోని పాకాల చెరువు నిండి పొంగి పొర్లింది. ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులోకి 1,778 క్యుసెక్యుల వరద చేరింది. కాగజ్‌నగర్ మండలం అందవెళ్లి వాగు  ప్రవాహానికి వంతెన తెగింది. దీంతో 35 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

‘భద్రాద్రి’ జలయమం

భద్రాద్రి జిల్లాలో శనివారం సరాసరి వర్షపాతం 44.5 మి.మీ నమోదైంది. చర్ల మండలంలో అత్యధికంగా 146.2 మి.మీ వర్షం కురిసింది. ఏజెన్సీలో కురిసిన వర్షాలకు గుండాల, ఆళ్లపల్లి మం డలాల్లోని మల్లన్న, కిన్నెరసాని వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో వరద నీరు కిన్నెరసాని జలాశయంలోకి భారీ గా వరద చేరుతోంది. వాగులు పొంగడంతో గొంపెల్లి కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయా యి. ములకలపల్లి మండలం కేం ద్రం నుంచి రింగురెడ్డిపల్లి వెళ్లే మార్గం లో వాగు పొంగి బీటీ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఆరు గ్రామాలకు రాక పోకలు నిలిచిపోయాయి. అశ్వారావుపేట మండలంలో పెద్దవాగు ప్రాజెక్ట్ మంపు ప్రాంతాలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ పరిశీలించారు. ముంపు బాధితులతో స్వయంగా మాట్లాడారు. వరద కారణంగా దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. పూర్తిగా దెబ్బతిన్న గుడిసెల యజమానాలకు రూ.4,100, పాక్షింగా దెబ్బతిన్న పక్కా ఇండ్లకు రూ.5,100, కచ్చా ఇండ్లకు రూ.2,100 చొప్పున పరిహారం అందిస్తామన్నారు.