హైదరాబాద్, మే 12 (విజయక్రాంతి): అపోలో హాస్పిటల్ డా క్టర్ సునీత నర్రెడ్డి.. ఐడీఎస్‌ఏ (ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ అమెరి కా) ఫెలోషిప్‌కు ఎన్నికైనట్లు ఆ సంస్థ ప్రకటిం చింది. అంటువ్యాధుల రంగంలో డాక్టర్ సునీత నర్రెడ్డి చేసిన విశేషమైన కృషికి, అంకితభావానికి గుర్తింపుగా ఈ అవకాశం దక్కినట్లు అపోలో యాజమాన్యం ప్రకటించింది. అంటువ్యాధులపై అవగాహన, నివారణ, చికిత్సను అందించడంలో నిబద్ధత లాంటి అంశాలు ఆమె ఫెలోషిప్ ఎంపికలో దోహదపడ్డాయని వెల్లడించింది.
ఈ ఫెలోషిప్ దక్కినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నానని డాక్టర్ సునీత నర్రెడ్డి ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐడీఎస్‌ఏ గుర్తింపు పొందినందుకు సునీత నర్రెడ్డిని అభినందిస్తున్నట్లు అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతా రెడ్డి పేర్కొన్నా రు. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో అత్యుత్తమ నైపుణ్యాన్ని కనబర్చిన వ్యక్తులకు ఐడీఎస్‌ఏ ఫెలోషిప్ లభిస్తుంది.