26-02-2025 12:38:34 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలంలోని దాచారం గ్రామ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మంగళవారం నాడు దేవత మూర్తుల విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగలిం చారు. అర్ధరాత్రి వేళలో దుండగులు దేవాలయంలో ప్రవేశించి రాముడు, సీత, లక్ష్మణు డు, రంగనాథ స్వామి దేవతల విగ్రహాలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు.
గతంలో కూడా ఈ దేవాలయంలో విగ్రహా ల చోరీ జరిగిందని, వరుసగా దొంగతనం జరుగుతుండడం పట్ల భక్తులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు. గతం లో దొంగతనాలకు పాల్పడ్డ నేరస్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తే దొంగతనాలు వరుసగా ఒకే దగ్గర జరిగేటివా అని ప్రశ్నిస్తున్నారు. దేవాలయ పూజారి శ్రీనివాస చార్యు లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.