calender_icon.png 3 March, 2025 | 11:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలను విజయవంతం చేయాలి

03-03-2025 03:41:02 PM

ఆలయ పూజారి సతీష్ భవాని

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని పాత బస్టాండ్ బురదగూడం సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య ఉన్న దేవాలయం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ పూజారి సతీష్ భవాని కోరారు. పట్టణ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో నూతనంగా నిర్మించిన కామాఖ్య ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను ఆరు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. శివరాత్రి పర్వదినం నుండి మూడు రోజులపాటు తాంత్రిక, వైదిక సంప్రదాయంలో పూజలు నిర్వహించి విగ్రహ ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.

దీనిలో భాగంగా ఈ నెల 4,5,6 తేదీలలో వైదిక సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన కోరారు. ఈ నెల 6న బ్రహ్మ ముహూర్తంలో ఉదయం 4 గంటలకు ఆలయంలో యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ స్థాపన, అనంతరం 11 గం,,కు మహా కుంభాభిషేకం, మహా పూర్ణాహుతి, బలి ప్రధానం అనంతరం అన్న సంతర్పణ  నిర్వహించడం జరుగు తుందన్నారు. మూడు రోజులపాటు అత్యంత వైభవంగా భక్తి ప్రవృత్తులతో నిర్వహించనున్న కార్యక్రమా లకు పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.