02-03-2025 07:01:29 PM
నాగల్ గిద్ద: నాగల్ గిద్ద మండల పరిధిలోని ఏనక్ పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన విఠలేశ్వర ఆలయ విగ్రహా ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నియోజకవర్గంలోని ఆయా పార్టీల నాయకులు నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి, జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నగేష్ షెట్కర్, పిసిసి సభ్యులు కే శ్రీనివాస్, హాజరై పాల్గొన్నారు. గత వారం రోజులుగా ఆలయంలో సప్తః కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి విఠలేశ్వర ఆలయానికి సంబంధించిన ప్రముఖ పీఠాధిపతులు చంద్రశేఖర్ మహారాజు అంబాదాష్ మహారాజ్ పాల్గొని ప్రత్యేక కీర్తన కార్యక్రమాల్లో నిర్వహించారు. మండల నాయకులు మాణిక్ రావు పాటిల్, మెత్రె పండరి, గుండెరావు పాటిల్ తదితరులు పాల్గొన్నారు.