నిర్మల్ (విజయక్రాంతి): చదువు ద్వారానే సమాజం గుర్తింపు వస్తుందని అందుకే ప్రతి ఒక్క మహిళా చదువుకోవాలని తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే పేర్కొనడం జరిగిందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధిక అన్నారు. శుక్రవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారిక సదస్సులు నిర్వహించారు. మహిళలు సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలంటే తప్పనిసరిగా చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గంగాధర్ హేమలత ఆఫ్రిన్ అర్చన తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా నిర్మల్ పట్టణంలోని ఎంజెపి గురుకుల పాఠశాలలో సోఫిలార్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను జరుపుకున్నారు. పలు పాఠశాలలో ఉత్తమ మహిళా ఉపాధ్యాయురాలను సన్మానం చేసి మెమొంట్లను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గీతారాణి, అనిల్, డేనియల్, గజపల్లి, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.