calender_icon.png 17 January, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంక్షేమ పథకాల కోసం అర్హులైన వారిని గుర్తించాలి

16-01-2025 11:30:12 PM

సంగారెడ్డి జిల్లాలో సర్వే తీరును పరిశీలించిన ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన...

సంగారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు క్షేత్రస్థాయిలో సర్వేలు సక్రమంగా చేయాలని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి హరిచందన తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లాలోని కంది, చిమ్మాపూర్, సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరు కోసం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించడం జరుగుతుందన్నారు. సర్వే కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో వెళ్లి సర్వే నిర్వహించాలన్నారు.

గ్రామాలలో ఎలాంటి తప్పులు లేకుండా సర్వే నిర్వహించి జాబితాను ప్రకటించాలన్నారు. గ్రామ సభల్లో ఎవరు కూడా అర్హులైన వారికి ఇచ్చారనే ఆరోపణలు రావద్దన్నారు. అధికారులు  క్షేత్రస్థాయి సర్వే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వే తీరని అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సర్వే తీరును ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరి చందనకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.