నాగర్ కర్నూల్, జనవరి 16 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి పేదవాడికి అందేలా గ్రామస్థాయిలోని గ్రామసభల ద్వారా అర్హులను గుర్తించి ఎంపిక చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం, రైతు భరోసా నూతన రేషన్ కార్డుల మంజూరి ఇందిరమ్మ ఇల్లు 20 పథకాలు అర్హులకు చేరేలా అధికారులు చొరవ తీసుకో వాలని సూచించారు.
ఈనెల 20 నుండి క్షేత్రస్థాయిలో పరిశీలించి, 23, 24తేదీల్లో గ్రామ సభలో ఆమోదం పొందిన జాబితాను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమర్పించాలన్నారు. నూతన రేషన్ కార్డుల కోసం దరఖాస్తులలో పేర్ల తొలగింపులు, చేర్పులు, నూతన కార్డుల జాబి తాను కూడా రూపొందించాలని, వార్షిక ఆదాయ వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు.