calender_icon.png 25 February, 2025 | 9:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెబ్బేరు గోదామును తగలబెట్టిన దోషులను గుర్తించండి..

25-02-2025 06:47:59 PM

డీజీపీకీ బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ వినతి..

ముషీరాబాద్ (విజయక్రాంతి): వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డు గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంపై విచారణ వేగవంతం చేసి దోషులను గుర్తించాలని తెలంగాణ డిజిపి డా.జితేందర్ కు బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం లక్డికాపూల్ లోని డీజీపి కార్యాలయంలో ఆయనను కలిసి అగ్నిప్రమాద ఘటనపై ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... గత సం. ఏప్రిల్ 1న వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్‌ యార్డు గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.10 కోట్లకు పైగా విలువ చేసే 12.94 లక్షల గన్నీ బ్యాగులు ధ్వంసమైన ఘటనపై పెబ్బేరు పోలీసులు ఇప్పటివరకు ఎరివంటి చర్య తీసుకోవడం లేదని అన్నారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదైనప్పటికీ, విచారణ ముగింపునకు రాకపోవడం, నెలల తరబడి ఛార్జ్‌షీటు దాఖలు చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. జిల్లా సరఫరా అధికారి(డిఎస్ఓ) సంఘటన జరగడానికి కొద్ది రోజుల ముందు సెలవుపై వెళ్లారని, పౌరసరఫరాల సంస్థ వనపర్తి ఇంచార్జి జిల్లా మేనేజర్ కూడా ఆ అధికారేనని, ఈ విషయంపై మరింత లోతుగా విచారణ చేయవలసిందిగా డీజీపీని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వజాగౌని వెంకటన్న గౌడ్, డా.అశోక్, ఆర్టీఐ విభాగం అధ్యక్షులు గుర్రం రాఘవేందర్, నాయకులు దేవర శివ, చంద్రయ్య, గౌతమ్ శంకర్ పాల్గొన్నారు.