calender_icon.png 9 January, 2025 | 2:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోలార్ ప్లాంట్లకు భూములు గుర్తించండి

09-01-2025 12:00:00 AM

కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు వారికి అందుబాటులో ఉన్న భూమిని గుర్తించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలెక్టర్లను ఆదేశించారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇప్పటికే టెండర్లను ఆహ్వానించామని, త్వరలోనే ఖరారు చేస్తామన్నారు.

బుధవారం ప్రజాభవన్‌లో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ..  ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ర్టవ్యాప్తంగా దాదాపు నాలుగువేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందన్నారు.   

‘పీఎం కుసుమ్’పై అవగాహన కల్పించాలి.. 

పీఎం కుసుమ్ పథకంలో భాగంగా రైతులు రెండు మెగావాట్ల వరకు సోలార్ పవర్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉందని, ఈ దిశగా రైతులను చైతన్యవంతులను చేయాలని కలెక్టర్లను భట్టి ఆదేశించారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో భారీ భవంతులపైన, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గుట్టలతో విస్తరించిన భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసే ఆలోచన చేయాలన్నారు. అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గిరిజన భూముల్లో ప్లాంట్లు ఉంటే వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని మంత్రి సీతక్క సూచించారు.