26-02-2025 01:34:14 AM
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): డ్రగ్స్, మత్తు పదార్థాలు ఎవరైనా వినియోగిస్తే గుర్తించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరం లో ఏర్పాటు మాదక ద్రవ్యాల, సైకోట్రోపిక్ పదార్థాల నియంత్రణపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు.
యాంటీ డ్రగ్ కమిటీ ప్రతి కళాశాలలో ఏర్పాటు చేయడం జరిగిందని, కళాశాలలో ఎవరైనా డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం, రవాణా ఉంటే గుర్తించాలని అన్నారు. జిల్లాలో జూనియర్, ఇంజినీరింగ్,డిగ్రీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ర్పభావం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పేర్కొన్నారు.
ఎస్.వి.ఎస్.మెడికల్ కళాశాల,ప్రభుత్వ మెడికల్ కళాశాల లో మాదక ద్రవ్యాల నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.గంజాయి సాగు చేయకుండా ఎక్సుజ్ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ శాఖ మాదక ద్రవ్యాల రవాణా,వినియోగం పై పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, పాన్ షాప్ లపై దృష్టి పెట్టాలని అన్నారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సమావేశం లో అదనపు ఎస్.పి.రాములు,ఎక్సుజ్ సూపరింటెండెంట్ విజయ్ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ వైద్య ఆరోగ్యశాఖ అధికారి శశికాంత్, ఏ.ఎం.ఓ దుంకుడు శ్రీనివాస్, అటవీ శాఖ, ప్రిన్సిపాల్ లు పాల్గొన్నారు.