calender_icon.png 26 December, 2024 | 7:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలాలను గుర్తించండి

04-08-2024 12:09:13 AM

హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డీవోలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారం కోసం ఎమ్మార్వో కార్యాలయాలకు వచ్చే ప్రతీ దరఖాస్తును వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను వెంటనే ఇన్‌వార్డులో అందజేయాలని చెప్పారు. ప్రజాపాలన కేంద్రంలో లోటుపాట్లు లేకుండా చూడాలని, గ్యాస్, ఎలక్ట్రిసిటీ సమస్యలను పరిష్కరించాలన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలన్నారు. సీఎంవో, ప్రజావాణి, మీసేవ దరఖాస్తులన్నీ వెంటనే పరిష్కారించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, ఆర్డీవోలు మహిపాల్, దశరథ్‌సింగ్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.