calender_icon.png 1 October, 2024 | 3:55 AM

ఆదర్శంగా అంగన్‌వాడీ కేంద్రాలు

01-10-2024 12:00:00 AM

ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి

బతుకమ్మ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క

కరీంనగర్, సెప్టెంబర్ 30 (విజయక్రాం తి): పూర్వ ప్రాథమిక విద్యను బోధిస్తూ  విజ యం సాధిస్తున్న తెలంగాణ అంగన్‌వాడీలు దేశంలోనే ఆదర్శంగా నిలవాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు.

సో మవారం కరీంనగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించా రు. ఈ సమావేశంలో రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పా ల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మానకొండూర్‌లో నిర్వహించిన పోషణ ఆరోగ్య జాతరకు చక్కటి ఆదరణ వ చ్చిందని, రాష్ట్రంలోని అన్నిచోట్ల పోషణ ఆ రోగ్య జాతరలు నిర్వహించాలని సూచించా రు.

కలెక్టర్లు, ఇతర అధికారులు వారంలో రె ండు, మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటి ంచాలని అన్నారు. అమ్మ మాట బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. అంగన్‌వాడీల్లో అధునాతన సిలబస్‌తో కూడిన విద్యతోపాటు నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

అంగన్‌వాడీ టీచర్లు ఆధునాతన బోధనా పద్ధతులను అవలంభించాలని సూచించారు. గర్భిణులకు నాణ్యమైన భోజనం అందించడంలో రాజీ పడొద్దని అన్నారు. అంగన్‌వాడీలకు కల్తీ సరుకులు పంపిణీ చేస్తే కాంట్రాక్టర్ల అనుమతులు వెంటనే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. వయోవృద్ధుల ఆశ్రమాల వార్డెన్లు వృద్ధులను తల్లిదండ్రుల్లాగా ఆదరించాలని కోరారు.

పిల్లలు ఆదరించని తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా నిలవాలని, ఆ దిశగా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాని మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీ రాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల సమస్యను ముఖ్యమంత్రి త్వరలో సమస్య పరిష్కరిస్తారని పేర్కొన్నారు.

ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామస్తులకు ఉపయోగపడే పనులు మాత్రమే నిర్వర్తించాలని తెలిపారు. బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు చేయా లని మంత్రి సీతక్క సూచించారు. సమావేశంలో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ కాంతి వెస్లీ, గ్రామీణాభివృద్ధి కమిషనర్ అని త రామచంద్రన్, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ హర్ష, సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ, అడిషనల్ కలెక్టర్లు ప్రపుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్ పాల్గొన్నారు.

అనంతరం ఎల్‌ఎండీ కాలనీలోని కరీంనగర్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల, వృత్తి విద్యా శిక్షణా కేంద్రం 35వ వార్షికోత్సవంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పొల్గొన్నారు.