calender_icon.png 3 March, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శప్రాయుడు శ్రీపాదరావు

03-03-2025 01:39:05 AM

  1. ఆయన జీవితం నేటితరానికి స్ఫూర్తి
  2. మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
  3. ప్రజలతో మమేకమైన వ్యక్తి: మండలి చైర్మన్ గుత్తా
  4. ఆయన సేవలు ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
  5. పలువురికి జీవన సాఫల్య పురస్కారాల అందజేత

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (విజయక్రాంతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  మాజీ స్పీకర్, మంథని మాజీ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీపాదరావు జీవితం నేటితరానికి ఆదర్శనీయమని, ఆయన జీవితాన్ని పాఠ్యాంశంగా తీసుకుని స్ఫూర్తి పొందాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కొని యాడారు.

దుద్దిళ్ల శ్రీపాదరావు 88వ జయంతి సందర్భంగా నగరంలోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఆదివా రం రాష్ట్ర ప్రభుత్వం, దుద్దిళ్ల శ్రీపాదరావు కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలను నిర్వహించారు.  ఈ సందర్భ ంగా ముఖ్యఅతిథిశాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్ర మాన్ని ప్రారంభించారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ తదితరులు శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. ఈ క్రమంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న ఆర్ గోవిందహరి, బీఎస్ రాములు,  హిమాన్షికి దుద్దిళ్ల  శ్రీపాదరావు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. 

సురభి గోపాల్, భాగ్య, దివ్యను సత్కరించారు. వేడుకలకు రాజకీయాలకతీతంగా వివిధ పార్టీల ఎమ్మెల్యేలు పాల్గొని శ్రీపాదరావు చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మాజీ ప్రధాని పీవీ నర్సింహరావుకు సన్నిహితంగా ఉంటూ ప్రజల కోరిక మేరకు సర్పం చ్ నుంచి ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా ఎదిగారన్నారు.

శ్రీపాదరావు స్ఫూర్తితో ఆయన కుమారుడు శ్రీధర్‌బాబు, కుటుంబసభ్యులు ప్రజాసేవకు అంకితమయ్యారని చెప్పారు. తాను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివేటప్పుడు శ్రీపాదరావుతో కలిసి ఖమ్మంలో కార్యక్రమంలో పాల్గొన్నానని జ్ఞాపకం చేసుకున్నారు. ప్రజలతో మమేకమైన వ్యక్తి శ్రీపాదరావు అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు.

మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు అందరిలో అజా త శత్రువుగా ఉండేవారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. ఇప్పటికీ ప్రజల్లో నిలిచిపోయేలా సేవ చేశారని చెప్పా రు.

కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడిగా ఉన్నప్పుడు శ్రీపాదరావుతో తన కు పరిచయం ఏర్పడిందని మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాశ్ తెలిపారు. శ్రీపాదరావు మృతివార్త తెలిసి దుఃఖించనివారు లేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గుర్తుచేసుకున్నారు. 

ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారు: శ్రీధర్‌బాబు

‘26 ఏళ్ల కిందట నాన్నను కోల్పోయామని, ఇప్పటికీ ఆయన ప్రజల గుండెల్లో చిరంజీవిగానే ఉన్నారని శ్రీపాదరావు తనయుడు, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. శ్రీపాదరావు జయంతిని ప్రభు త్వం తరఫున అధికారికంగా నిర్వహించడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తు న్నాన న్నారు.

ఇందుకు సహకరించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తదితర ప్రభుత్వ పెద్దలకు తమ కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలిపారు.  ఆయన చూపిన అడుగు జాడల్లోనే తమ కుటుంబ సభ్యులం నడుస్తున్నామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీపాదరావు సతీమణి జయ, ఆయన కుటుంబసభ్యులు, ఎమ్మెల్యేలు హరీశ్ పాల్వాయి, పైడి రాకేష్‌రెడ్డి, మక్కన్‌సింగ్‌రాజ్ ఠాకూర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.