calender_icon.png 27 January, 2025 | 6:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందరూ కలిస్తేనే ఆదర్శ తెలంగాణ

27-01-2025 01:11:31 AM

  1. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం వైపే ప్రతి అడుగు
  2. వాగ్దానాల అమలుకు రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యం
  3. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకత
  4. గణతంత్ర వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ 

హైదరాబాద్, జనవరి 26 (విజయక్రాం తి): రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వా మ్యం, స్వేచ్ఛ, సమానత్వ విలువలకు పునరంకితమవుదామని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు.  గతంలో ఎన్నడూలేని విధంగా తెలంగాణ ప్రస్తుతం కీలక దశలో ఉందని వెల్లడించారు. అంద రం కలిసి పనిచేస్తేనే అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచే తెలంగాణను నిర్మించగలమని అభిప్రాయపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం వేసే ప్రతి అడుగు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం దిశ గా సాగుతోందని స్పష్టం చేశారు. సంపద, సామరస్యం వైపు తెలంగాణ పయనిస్తోందన్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన 76వ గణతంత్య్ర వేడుకలకు గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తొలుత గవర్నర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు.

అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలనుద్ధేశిం చి ఆయన మాట్లాడారు. ‘రాజ్యాంగం కేవ లం న్యాయపత్రమే కాదు, అది జీవన వాహ కం, యుగయుగాలకు స్ఫూర్తి వంటిది’ అన్న అంబేద్కర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణను, దేశాన్ని ప్రగతి, సమ్మిళిత అభివృద్ధి వైపు నడిపించుకుందామని పిలు పునిచ్చారు. 

 తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గే యం, సాంస్కృతిక వైభవాన్ని చాటాయన్నా రు. రాష్ట్ర సాంస్కృతిక చరిత్రలో ఇదొక కీలక ఘట్టమని అభిప్రాయపడ్డారు. కళలు, సం స్కృతి, సాహిత్యం, జర్నలిజం రంగాల్లో అపారమైన సేవలందించిన ప్రముఖ వ్య క్తులు గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయరాజు, సుద్దాల అశోక్ తేజ, ఎక్కా యాదగిరిరావు, పాశం యాదగిరి వంటివారిని సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించడం అపూర్వమైన నిర్ణయమని అభివర్ణించారు. 

రైతు భరోసాతో మరింత ఉత్పత్తి

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముకగా ఉందని, 2024లో తెలంగాణ వర్షాకాలంలో రికార్డు స్థాయిలో 1.59 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే అత్యధిక ఉత్పత్తి సాధించిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 27 రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేసిందన్నారు.

రైతు భరోసా పథకం రైతులు ఉత్పత్తి మరింత పెంచడానికి దోహదపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల వల్ల కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఇటీవల ఇచ్చిన తీర్పుతో నదీజలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా పొందే వీలు ఏర్పడిందని చెప్పారు.

మహిళాభివృద్ధి, విద్య, ఆరోగ్య రంగాలపై శ్రద్ధ

తెలంగాణ అభివృద్ధిలో మహిళలే కీలకమని గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడమనేది ఒక పరివర్తనాత్మక చొరవగా అభి వర్ణించారు. అలాగే, గృహజ్యోతి, రూ.500 లకే ఎల్‌పీజీ సిలిండర్, కోటి మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా, లక్షాధికారులు గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి వంటి పథకాలు వారి సాధికారతకు దోహదపడతాయని చెప్పారు.

తెలంగాణ యువత ఉజ్వల భవిష్యత్తుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బాటలు వేస్తోందన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెం టర్స్ (ఏటీసీ)ల ఏర్పాటు ద్వారా రానున్న రోజుల్లో నైపుణ్యమైన వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వం అత్యంత శ్రద్ధ వహిస్తోందని గవర్నర్ అన్నారు.

ఆరోగ్య రం గంలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని గుర్తించిన కేం ద్రం ఈ ఏడాది కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించేందుకు అనుమతులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, సమాజంలోని ఇతర బలహీన వర్గాలకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘కుల గణన సర్వే’ను చేపట్టిందని, ఇది వివిధ రకాల విధానాల రూపకల్పనకు దోహదపడుతుందని గవర్నర్ చెప్పారు. ప్రజాభద్రత, నేరాల నివారణలో పోలీసు శాఖ నిబద్ధతను గవర్నర్ ప్రశంసించారు.

సైనిక్ స్మారక్ వద్ద సీఎం నివాళి

రిపబ్లిక్ డే సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఉన్న అమరవీరుల స్థూపానికి సీఎం రేవంత్‌రెడ్డి నివాళి అర్పించారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిర్వహించిన పరేడ్ ఆకట్టుకుంది. ఫైర్, టీజీఎస్పీ, మహిళా పోలీసులు, ఎయిర్‌ఫోర్స్ మొత్తం 10 బృందాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. ఇందులో ఒడిశా నుంచి వచ్చిన దళం కూడా ఉంది.