పెబ్బేరు, జనవరి 4: ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం గుంటూరులోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో సంక్రాతి సంబరాలను పురస్కరించుకొని శనివారం రైతు నేస్తం ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చేంనాయుడు, నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, పద్మశ్రీ వై. వెంకటేశ్వర్ రావు, విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ లావు రత్నయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు పురస్కారాలను అందజేశారు.
అందులో భాగంగానే పెబ్బేరు మున్సిపాలిటీకి చెందిన ప్రకృతి వ్యవసాయం యువ రైతు ప్రవీణ్ కుమార్ రెడ్డికి అభ్యుదయ ఆదర్శ రైతు పురస్కారం అందజేశారు. ఈ సందర్బంగా పెబ్బేరు మండల ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, రైతంగా నిపుణులు, రైతులు, ప్రజలు యువ రైతు ప్రవీణ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
పురస్కారం అందుకుంటున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి