కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఐడీసీయంఎస్ చైర్మన్ బాదావత్ తారాచంద్ నాయక్ కలిశారు. బాన్సువాడ పట్టణంలో తమ సంఘ నిర్మాణంలో 3 ఎకరాల 16 గుంటల స్థలం పట్టణంయందు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయిస్తే ప్రస్తుతం ఈ స్థలంలో ప్రస్తుతం గోదాములు, సీడ్ ప్లాంట్లు, మార్కెట్ యార్డు, ప్లాట్‌ఫారం నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో ఈ విషయం గురించి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశాయిపేట్ సొసైటీ వైస్‌చైర్మన్ అంబర్‌సింగ్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్‌నాయక్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.