calender_icon.png 22 October, 2024 | 8:40 AM

షేక్ హసీనాపై అరెస్ట్ వారెంట్

18-10-2024 01:12:34 AM

నవంబర్ 18లోగా   హాజరుపరచాలని   ఐసీటీ చీఫ్ ఆదేశాలు

ఢాకా, అక్టోబర్ 17: రిజర్వేషన్లపై చెలరేగిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో తన పదవికి రాజీనామా చేసిన బంగ్లా ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. కాగా ఆమె పై తాజాగా అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ ఈ వారెం ట్‌ను జారీ చేసింది. హసీనాను వచ్చేనెల 18లోగా తమ ఎదుట హాజరుపర చాలని ఐసీటీ చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం ఆదేశాలు జారీ చేశారు. బంగ్లాదేశ్‌లో జూలై 15 నుంచి ఆగస్టు 5 వరకు ఆగిన మారణహోమానికి హసీనాను బాధ్యురాలిని చేయాలని 60 ఫిర్యాదులు అందాయి. వాటిపై దర్యాప్తును ప్రారంభించిన ట్రై బ్యునల్ భారత్‌లో ఆశ్రయం పొందుతున్న హసీనాను బంగ్లాదేశ్‌కు రప్పిస్తా మని పేర్కొంది. ఇదిలా ఉండగా హసీనాను చట్టబద్ధంగా తమ దేశానికి అప్ప గించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.