హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ఏడు జోన్లలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) ఇన్‌స్ట్రక్టర్లుగా ఔట్ సోర్స్‌ంగ్ ప్రాతిపదికన పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ఆ సంస్థ కార్యదర్శి అలుగు వర్షిణి పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో పనిచేసేందుకు ఒక సీనియర్ పీఆర్వో, ఒక జూనియర్ పీఆర్వోను నియమించేందుకూ దరఖాస్తులను ఆహ్వాని స్తున్న ట్టు తెలిపారు. ఐసీటీలకు డీపీవోలకు చెల్లించే గౌరవ వేతనం, పీఆర్వోలకు 11 నెలల కాలపరిమితితో కన్సల్టెంట్‌లకు ఇచ్చే గౌరవ వేతనం ఉంటుందని వివరించారు.
అర్హులైన అభ్యర్థులు మాసా బ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్ భవన్‌లో సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 7 నుంచి 10 వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఐసీటీ ఖాళీలు కలిపి మొత్తం 65 పోస్టులున్నాయి. ఐసీటీ పోస్టులకు రాత, కంప్యూటర్ స్కిల్ టెస్ట్ ద్వారా, పీఆర్వోలకు అనుభవం, అర్హతలు, ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.