న్యూఢిల్లీ: దేశంలోని ప్రముఖ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటయిన ఐసీఐసీఐ బ్యాంక్‌ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.11,029 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.9,649 కోట్లతో పోలిస్తే ఇది 14.6 శా తం ఎక్కువ, కేటాయింపులు పెరిగినప్పటికీ మెరుగైన వృద్ధిని నమోదు చేయడం విశేషం. వడ్డీలపై ఆదాయం సైతం గత ఏడాదితో పోలిస్తే 7.3 శాతం పెరిగి రూ. 19,553 కోట్ల కు చేరింది. కాగా గత ఏడాది కేటాయింపు లు రూ.1,292 కోట్లతో పోలిస్తే ఈ సారి కాస్త పెరిగి రూ. 1,332 కోట్లకు చేరింది. ఇక నిరర్థక ఆస్తుల నిష్పత్తి (ఎన్‌పీఏ)గత ఏడాది ఇదే సమయంలో 2.16 శాతంనుంచి 2.15 శాతానికి తగ్గింది. కాగా రుణ వితరణ గత ఏడాదితో పోలిస్తే 15.7 శాతం పెరిగింది.అలాగే డిపాజిట్లు సైతం 15.1 శాతం పెరిగాయి.
159 % పెరిగిన పీఎన్‌బీ లాభాలు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజా బ్ నేషనల్ బ్యాంక్ లాభాలు గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏకంగా 159 శాతం పెరిగా యి. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ నికర లాభం 1,255 కోట్లు ఉండగా ఇప్పుడ ది ఒక్కసారిగా రూ.3,252 కోట్లకు పెరిగింది. అలాగే నికర వడ్డీ రాబడి సైతం గత ఏడాది ఉన్న రూ.9,504 కోట్లనుంచి 10.2 శాతం పెరిగి రూ.10,476 కోట్లకు చేరుకుంది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి సైతం గణనీయంగా మెరుగుపడింది.