calender_icon.png 25 October, 2024 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ఫారెక్స్ కార్డ్

03-07-2024 01:51:35 AM

న్యూఢిల్లీ, జూలై 2: ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ప్రిపెయిడ్ సఫి రో ఫారెక్స్ కార్డును ప్రవేశపెట్టింది. వీసాతో కలిసి తెచ్చిన ఈ కార్డును విదేశీ విద్యా సంస్థల్లో అడ్మిషన్ ఫీజు, కోర్సు సంబంధిత ఫీజు చెల్లింపుతో పాటు ఇతర రోజువారీ ఖర్చులకు ఉపయోగించుకోవచ్చని బ్యాంక్ మంగళవారం తెలిపింది. ఎటువంటి క్రాస్‌కరెన్సీ మార్క్‌అప్ చార్జీలు లేకుండా 15 కరెన్సీల్లో లోడింగ్, లావాదేవీలు జరుపుకోవచ్చని తెలిపింది.

ఈ కార్డులో ఒక కరెన్సీని లోడ్ చేసుకున్నా, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. రూ.15,000 జాయినింగ్ బెనిఫిట్ అందిస్తున్నామన్నది. వెల్‌కం కిట్‌లో రెండు కార్డులు ఇస్తామని, ఒకటి ప్రైమరీకాగా, మరోటి రిప్లేస్‌మెంట్ కార్డని తెలిపింది. ప్రైమరీ కార్డు పోయినా, పాడైనా రిప్లేస్‌మెంట్ కార్డును ఐమొబైల్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారాగాని, బ్యాంక్ కస్టమర్ కేర్‌కు కాల్ చేసిగాని యాక్టివేట్ చేసుకోవచ్చన్నది. ఇతర ఫారెక్స్ కార్డుల్లానే ఈ కార్డును విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఎక్కడినుంచైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఐమొబైల్ పే ద్వారా లోడ్ చేసుకోవచ్చని వివరించింది.