25-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 24: దేశంలోనే మొట్టమొదటి, ఏకైక ఆర్గానిక్ క్రీమరీ అయిన ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్ తన సేవలను విస్తరించింది. హైదరాబాద్ బేగంపేట్‌లో మూడో ఔట్‌లెట్‌ను గురువారం ప్రారంభించింది. ప్రారంభోత్సవానికి సినీ సంగీత దర్శకుడు, ఆర్పీ పట్నాయక్, మాదాపూర్ ట్రాఫిక్ డివిజన్ ఏసీపీ కె.సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
టి. నర్సింగరావు (ఇన్‌స్పెక్టర్,- రాంగోపాల్‌పేట్,), పి.పాపయ్య (ఇన్‌స్పెక్టర్, - బేగంపేట్ ట్రాఫిక్), జర్నలిస్ట్ స్వప్న గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్ ఫౌండర్ సుహాస్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
బేగంపేట్‌లోని కొత్త ఔట్‌లెట్‌లో ఐస్‌బర్గ్ ఒక రూపాయికే గ్రాము ఆర్గానిక్ ఐస్‌క్రీమ్‌ను అందిస్తోంది. మరిన్ని స్టోర్స్ హైదరాబాద్‌లో తెచ్చేందుకు కృషి చేస్తున్నామని ఐస్‌బర్గ్ ఆర్గానిక్ ఐస్‌క్రీమ్స్ ఫౌండర్ సుహాస్ వెల్లడించారు. కాగా ఐస్‌బర్గ్‌కు దేశ వ్యాప్తంగా 72 స్టోర్స్ ఉన్నాయి.