calender_icon.png 23 February, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. ఊహించని ప్రైజ్‌మనీ

14-02-2025 06:17:15 PM

2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy) పాకిస్థాన్ ఆతిథ్యాన ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాల్గొంటున్న ఎనిమిది టీమ్ లు తమ స్క్వాడ్ లను ఇప్పటికే ప్రకటించాయి. దుబాయి వేదికగా టీమ్ ఇండియా(Team India) మ్యాచులు జరుగనున్నాయి. తాజాగా, ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీ(Prize Money)కి సంబంధించిన వివరాలను ఐసీసీ(ICC) శుక్రవారం వెల్లడించింది. చివరగా 2017 ఎడిషన్ లో జరిగిన ఈ టోర్నీతో పోలిస్తే ఇప్పుడు 53 శాతం ప్రైజ్‌మనీ పెరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతి మ్యాచ్ కు ఐసీసీ అదనంగా 29 లక్షలు ఇవ్వనుంది.

ప్రైజ్‌మనీ వివరాలు...

విజేత ప్రైజ్‌మనీ: రూ. 20.8 కోట్లు

రన్నరప్ ప్రైజ్‌మనీ: రూ. 10.4 కోట్లు

సెమీ ఫైనాలిస్టులు (ప్రతి జట్టు): రూ. 5.2 కోట్లు

ఐదు & ఆరో స్థానం: రూ. 3 కోట్లు

ఏడు & ఎనిమిది స్థానాలు: రూ. 1.2 కోట్లు

ప్రతి మ్యాచ్: రూ. 29 లక్షలు