న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ అంతర్జాతీయ క్రికెట్ మండలికి తల బొప్పి కట్టిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ పాక్‌లో నిర్వహించాల్సి ఉండగా.. భద్రతా కారణాల రీత్యా పాక్‌కు వెళ్లబోమని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో భారత మ్యాచులను పాక్‌లో కాకుండా బయట నిర్వహించాలని ఐసీసీ భావించినా కానీ అలా జరగలేదు.
నవంబర్ 26న రెండు దేశాలతో సమావేశం నిర్వహించాలని ఐసీసీ యోచిస్తున్నట్లు సమాచారం. భారత్‌కు పాక్‌కు వెళ్లని పక్షంలో టోర్నీని ఎలా నిర్వహించాలి. పాక్ అభ్యంతరాలు ఎలా తీర్చాలి అనే దానిపై ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది.