calender_icon.png 16 November, 2024 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాక్ వక్రబుద్ధికి ఐసీసీ చెక్

16-11-2024 02:38:13 AM

చాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రదర్శన నిలిపివేత

న్యూఢిల్లీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో తలపెట్టిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టూర్ ప్రదర్శనకు ఐసీసీ చెక్ పెట్టింది. పాక్‌లో చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు భారత్ నిరాకరించిందన్న అసూయతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) టూర్ ప్రదర్శన నిర్వహించాలనకుంది. ఇందులో భాగంగా నవంబర్ 16న ఇస్లామాబాద్‌లో టూర్ ప్రారంభం కావాల్సి ఉంది.

అయితే షెడ్యూల్‌లో పీవోకేలో ఉన్న స్కర్దు, హుంజా, ముజఫరాబాద్ ప్రాంతాలను చేర్చింది. భారత్‌ను కవ్వించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పీసీబీ వక్రబుద్ధిని కనిపెట్టిన బీసీసీఐ టూర్‌ను రద్దు చేయాలంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన ఐసీసీ.. టూర్ ప్రదర్శనను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు పాక్‌కు వెళ్లలేమంటూ బీసీసీఐ ఐసీసీకి తేల్చి చెప్పింది. హైబ్రీడ్ మోడ్‌లో నిర్వహించేందుకు సహకరించాలని ఐసీసీ కోరినప్పటికీ పీసీబీ అందుకు ససేమీరా అంటోంది. టోర్నీని పాక్ నుంచి తరలించాలా లేక హైబ్రీడ్ మోడ్‌లో జరపాలా అని ఐసీసీ ఆలోచనలో పడడంతో షెడ్యూల్ ప్రకటన మరింత ఆలస్యమవనుంది.