09-03-2025 06:42:48 PM
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్: దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం(Dubai International Cricket Stadium)లో జరుగుతున్నా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్(ICC Champions Trophy 2025 Final)లో భారత స్పిన్నర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. న్యూజిలాండ్(New Zealand)ను 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 పరుగులకే పరిమితం చేశారు. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్(Captain Mitchell Santner) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు.
న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్(Daryl Mitchell) (63) పరుగులతో టాప్ స్కోరర్ గా ఉండగా, రచిన్ రవీంద్ర (37), గ్లెన్ ఫిలిప్స్ (34) పరుగులు చేశారు. కాగా, విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14), కెప్టెన్ మైకేల్ శాంట్నర్ (8) తక్కువ పరుగులతో నిరాశపరిచారు. చివర్లో మైఖేల్ బ్రేస్‌వెల్(Michael Bracewell) (53*) అర్ధ సెంచరీతో బ్లాక్‌క్యాప్స్ తరపున కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ తలో రెండు వికెట్లతో రాణించాగా... జడేజా, షమీ చెరో వికెట్ తీశారు. టీమీండియా(Team India) ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచేందుకు 252 పరుగులు చేయాల్సి ఉంది.