హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 24 (విజయక్రాంతి): పీజీడీఎం కళాశాల, ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ 17వ కాన్వోకేషన్ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీవీఆర్‌ఎల్‌ఎస్ చైర్మన్, ఐఐఎం మాజీ ప్రొఫెసర్ డాక్టర్ టీవీ రావు, ఎన్‌ఏసీఎల్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, న్యూమార్క్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ నెడ్ మోదీ, ఐసీబీఎం కళాశాల చైర్‌పర్సన్ రీతు జరార్, కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ షంషుద్దీన్ జరార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అతిథులు పట్టాలను అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.