calender_icon.png 8 January, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీఏఐ హైదరాబాద్ చాప్టర్ వ్యవస్థాపక దినోత్సవం

07-01-2025 12:53:47 AM

ప్రారంభించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 6 (విజయక్రాంతి): ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా -(ఐసీఏఐ) హైదరాబాద్ చాప్టర్ 60వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం సోమాజిగూడలోని కత్రి యా హోటల్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా టీసీఏ ఉపాధ్యక్షుడు సీఎంఏ శ్రీనివాసప్రసాద్, సీఎంఏ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్  కేచేఏవిఎస్‌ఎన్ మూర్తి, ఐసీఎంఏఐ సెంట్రల్ కౌన్సిల్ మెంబర్ దల్వాడి అశ్విన్‌కుమార్ గోర్ధర్భాయి, ఐసీఎంఏఐ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ డాక్టర్ లావణ్య కందూరి, హైదరాబాద్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ఐసీఏఐ హైదరాబాద్ చాప్టర్ సమాజానికి చేసిన సేవలు, మేనేజ్‌మెంట్ అకౌంటింగ్ అభివృద్ధికి చేసిన కృషిని ప్రతిబింబిస్తుందని చెప్పారు. విజన్ ఇండియా 2047 లక్ష్యాలను సాధించడంలో ఆ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయంమని పేర్కొనానరు. సీఎంఏ హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్ డాక్టర్ లావణ్య కందూరి మాట్లాడుతూ..

హైదరాబాద్ చాప్టర్ 60 వ వజ్రోత్సవాన్ని జరుపుకోవడం చాలా గర్వకారణమన్నారు. ఈ సంవత్సరం తమ థీమ్ ‘ఇన్‌స్పిరేషన్ ఇంక్యుబేటర్, స్టెప్ ఇన్‌టు యాక్షన్’ ద్వారా, ఆలోచనల నుంచి చర్యల దిశగా ప్రయాణం చేసే ప్రేరణను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా, గత అధ్యక్షులు, చైర్‌పర్సన్ల కృషిని స్మరించుకుంటూ, వారి విశేష సేవలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు.