calender_icon.png 24 February, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐబీఎస్ 2003 బ్యాచ్ రీయూనియన్

24-02-2025 12:47:59 AM

చేవెళ్ల , ఫిబ్రవరి 23: ఇక్పాయ్ బిజినెస్ స్కూల్ (ఐబీఎస్) 2003 బ్యా పూర్వ విద్యార్థుల రీయూనియన్ ఘనంగా నిర్వహించారు. శంకర్‌పల్లి మండలం దొంతన్ పల్లి లోని క్యాంపస్‌లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల తో పాటు యుఎస్, యుకె, సింగపూర్, దుబాయ్ లాంటి దేశాల నుంచి సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. 

ఐఎఫ్ హె ఈ రిజిస్ట్రార్ డా. ఎస్. విజయలక్ష్మి, ఏఆర్ సీ డీన్ ప్రొఫెసర్ జి.కె. శ్రీకాంత్, ఐబీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎస్. వేణుగోపాల్ రావు, డీన్ ప్రొఫెసర్ డి. సతీష్, ఎస్‌ఏస్ డి ఐ ఎఫ్ ఎఫ్ హె ఈ జాయింట్ రిజిస్ట్రార్ మధుసూదన్ రావు గౌరవ అతిథులుగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డా. మహేష్ భాంగ్రియా రాసిన కార్పొరేట్ అడ్వెంచర్స్ , ఉపేంద్ర ధర్మాధికారి రూపొందించిన ప్రిన్సెస్ ఐన్ బ్లాక్ అనే పుస్తకాలను ఆవిష్కరిచారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ..  పూర్వ విద్యార్థులు ప్రస్తుతం గ్లోబల్ కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవుల్లో ఉన్నారని , ఎంతోమంది సక్సెస్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్లుగా ఎదగడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఐబీఎస్ తోనే సాధ్యం అయ్యిందని పేర్కొన్నారు. 2003 బ్యా విజయగాథను ప్రతిబింబించిన ఈ రీయూనియన్ విశ్వవిద్యాలయానికి  ప్రేరణ కలిగించిందని చెప్పారు.