calender_icon.png 21 January, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైకోర్టుకు చేరిన ఇబ్రహీంపట్నం భూవ్యవహారం

21-01-2025 01:02:07 AM

  1. శ్రీఇందు కాలేజీ గుప్పిట్లో ప్రభుత్వ భూమి  
  2.  * 3.20 ఎకరాల ప్రభుత్వ భూమి గోల్‌మాల్
  3. విద్యా వ్యాపారవేత్తల ఆధీనంలో మరిన్ని భూములు
  4. కోట్లు విలువచేసే ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం

ఇబ్రహీంపట్నం, జనవరి 20 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం హైకోర్టుకు చేరింది. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఇక్కడి భూముల ధరలు ఆకాశన్నంటడంతో అక్రమార్కుల కన్ను విలువైన ప్రభుత్వ భూములపై పడింది.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం బాగాయత్ సర్వే నంబర్ 221కి సంబంధించి 3.20 గుంటల ప్రభుత్వ (పోరంబోకు) భూమి అన్యాక్రాంతమైన  ఘట   బీఎస్పీ నాయకుడు మచ్చ మహేందర్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ భూ  కాపాడలేకపోయిన అధికారులపై చర్య  తీసుకోవాలని, అక్రమార్కుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కాగా దీనిపై హైకోర్టు స్పం  ఆ భూమిలో ఎలాంటి లావాదేవీలు, క్రయవిక్రయాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని.. ఫిబ్రవరి 4న  కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.  

పక్కా ప్లాన్ ప్రకారమే!

ఇబ్రహీంపట్నంలోని సర్వే నంబర్ 221లో గల 3.20 ఎకరాల ప్రభుత్వ భూమి 2000-01 సంవత్సరంలో స్థానికంగా ఉన్న ఒకరి పేరును రెవెన్యూ అధికారులు పహణీలో చేర్చారు. అనంతరం ఆ భూమిని రంగారెడ్డి  సబ్ రిజిస్ట్రార్ 2002లో శ్రీఇందు కళాశాల యజమాని రంగినేని వెంకట్‌రావు కు చెందిన న్యూ లయోలా మోడల్ ఎడ్యూకేషన్ సొసైటీ పేరుమీద రిజిస్ట్రేషన్ చేశారు.

మళ్లీ 2023లో రెవెన్యూ అధికారులు 59 జీవో, మరో కొత్త జీవోను ఆసరాగా చేసుకుని క్రమబద్ధీకరణ పేరుతో అదే యాజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేశారు. ఈ 3.20 ఎకరాల ప్రభుత్వ భూమిని 16,940 చదరపు గజాలకు మార్చి రెగ్యులరైజ్ చేయాలని 2023 జూన్ 15న తహసీల్దార్ నుంచి కలెక్టర్‌కు, జూన్ 21 కలెక్టర్ నుంచి సీసీఎల్‌ఏకు సిఫారసు లెటర్లు వెళ్లాయి.

ఆ తర్వాత జూన్ 24 సీసీఎల్‌ఏ నుంచి రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌కు ఆ భూమిని రెగ్యులరైజ్ చేయొచ్చు అంటూ ఫైల్ వెళ్లింది. అనంతరం అక్టోబర్‌లో తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ మొదలవ్వగా అంతకుముందే అక్టోబర్ 6న 16,940 చదరపు గజాల స్థలాన్ని 2014 ప్రభుత్వ ధరకు రంగినేని వెంకట్‌రావుకు చెందిన న్యూ లయోలా మోడల్ ఎడ్యూకేషన్ ఎడ్యూకేషన్ సొసైటీకి క్రమబద్ధీకరిస్తున్నట్టు జీవో నంబర్ 150 విడుదల అయ్యింది.

జీవోకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలంటూ ఆ తర్వాతి రోజే అక్టోబర్ 7న రంగారెడ్డి కలెక్టర్.. ఇబ్రహీంపట్నం తహసిల్దార్‌కు లేఖ పంపారు. రిజిస్ట్రేషన్ చేయటానికి అనుమతించాలని అక్టోబర్ 8న తహసిల్దార్ మళ్లీ కలెక్టర్ కు లేఖ రాశారు.

ఆ తర్వాతి రోజే అక్టోబర్ 9న అనుమతి మంజూరు చేస్తూ కలెక్టర్ ఆదేశాలిచ్చారు. అంటే జీవో రిలీజ్ అయిన నాటి నుంచి చకచకా ఫైల్ పరిగెత్తడం చూస్తుంటే అధికారులు ఈ విషయంలో ఎంత ఆసక్తి ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు.

ఎన్నికల కోడ్ సైతం ఉల్లంగించి..

కోట్లు విలువ చేసే ఈ స్థలాన్ని న్యూ లయోలా మోడల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరున 2023లో రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ వ్యవహారమంతా 2023-అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంగిస్తూ, పోలింగ్ తేదీకి అయిదు రోజుల ముందు.. నవంబర్ 25న రిజిస్ట్రేషన్ చేశారు. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ చేసేనాటికి అక్కడ గజం ధర రూ.వేలల్లో నడుస్తుంది. ఆ లెక్కన చూసుకుంటే ఇదంతా కోట్ల రూపాయల పైమాటే.