calender_icon.png 16 October, 2024 | 3:54 PM

హైకోర్టుకు ఐఏఎస్ అధికారులు

16-10-2024 01:20:41 PM

హైదరాబాద్: డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అత్యవసరంగా విచారించాలని ఐఏఎస్ అధికారులు కోరారు. ఐఏఎస్ లు ఆమ్రపాలి, వాణీప్రసాధ్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, శివశంకర్, హరికిరణ్, సృజన కోర్టులో పిటిషన్ వేశారు. ఐఏఎస్ లు వేసిన పిటిషన్ పై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ జరుపుతామని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.  

కేడర్ బదిలీల కోసం వారి అభ్యర్థనలను సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తిరస్కరించింది. ఈ అధికారులు ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తమకు కేటాయించిన రాష్ట్రాలకు తిరిగి వెళ్లకుండా ప్రస్తుత రాష్ట్రాలలోనే ఉండాలని కోరుకున్నారు. తొలుత 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అధికారులను ఆయా రాష్ట్రాలకు కేటాయించారు. వాకాటి కరుణ, ఆమ్రపాలి కాట, ఏ వాణీ ప్రసాద్, రోనాల్డ్ రోస్ లు ఏపీ కేడర్‌కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్నారు. కాగా, సృజన గుమ్మల తెలంగాణ కేడర్‌కు కేటాయించగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్నారు. మొత్తం ఐదుగురు అధికారులు తమ ప్రస్తుత రాష్ట్రాల్లోనే కొనసాగాలని కోరుతున్నారు.