హైదరాబాద్,(విజయక్రాంతి): ఐఏఎస్ అధికారుల పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదానాలు ముగిశాయి. డీవోపీటీ ఉత్తర్వులపై వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ ఐఏఎస్ అధికారులు తెలంగాణ హైకోర్టునుఆశ్రయించి, లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న ఐఏఎస్ ల పిటిషన్లు ధర్మసనం కొట్టివేసింది. బాధ్యతాయుతమైన అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగనీయవద్దని చెప్పింది. ముందైతే మీకు కేటాయించిన రాష్ట్రాల్లో చేరాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడ్డింది. మరోసారి పరిశీలించామని డీవోపీటీని ఆదేశించమంటారా అని కోర్టు ప్రశ్నించింది. స్టే ఇస్తూ పోతే ఈ అంశం ఎన్నటికీ తేలదని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది.
పదేళ్ల అనుభవం పరిగణించాలన్న హైకోర్టు ఆదేశాలను కేంద్రం పట్టించుకోలేదని ఐఏఎస్ అధికారులు తెలిపారు. క్యాట్ తుది తీర్పు ఇచ్చే వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్ లు హైకోర్టును కోరారు. కాగా, ఐఏఎస్ లను 15 రోజులు రిలీవ్ చేయవద్దని కేంద్రానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు రాసిన లేఖలను కోర్టుకు సమర్పించారు. కేంద్రం తరపున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహ శర్మ వాదనలు వినిపించన న్యాయవాది ఉద్యోగులు ఎక్కడ పనిచేయాలో కోర్టులు నిర్ణయించవద్దన్న కేంద్రం క్యాట్ స్టే ఇవ్వకపోవడం సరైన నిర్ణయమే అని తెలిపింది. డీవోపీటీ నిర్ణయంపై వివరాలతో క్యాట్ లో కౌంటర్ దాఖలు చేస్తామన్న ఏఎస్జీ వెల్లడించింది. ఐఏఎస్ అధికారుల పిటిషన్లు కొట్టివేయాలని కేంద్రం కోరింది. డీవోపీటీ ఉత్తర్వులు నిలిపివేసేందుకు క్యాట్ నిన్న నిరాకరించింది.