15-04-2025 12:38:09 AM
చేర్యాల,ఏప్రిల్ 14: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఐఏఎస్ అధికారి కాత్యాయనీ దేవి సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనములు ఇచ్చా రు. ఆలయ ఏఈఓ శ్రీనివాస్ మల్లికార్జున స్వామి చిత్రపటాన్ని, స్వామి వారి శేష వస్త్రం తో పాటు ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, అధికారులు శ్రీరాములు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.