హైదరాబాద్, జనవరి 28 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ)కి 5 ఎకరాల భూమిని కేటాయిం చడాన్ని సవాల్ చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వాయిదా వేసింది. మంగళవారం ఇరుపక్షాల వాదనలు పూర్తి కావటంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గంలోని సర్వే నంబర్ 83/1 ప్లాట్ నంబర్ 27 లోని 3.7 ఎకరాల ప్రభుత్వ భూమిని ఐఏఎంసీకి కేటాయిస్తూ 2021, నవంబర్ 26న జీవో నంబర్ 126ను విడుదల చేసింది. నిర్వహణ ఖర్చుల కింద అదనంగా రూ.3 కోట్లు మంజూరు చేస్తూ మరో జీవో ఇచ్చింది.
ఆ జీవోలను కొట్టివేయాలని న్యాయవాది కే రఘునాథ్ రావు వేసిన పిల్‌పై జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ కే సుజన ధర్మాసనం విచారణ పూర్తి చేసింది. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఐఏఎంసీ తరఫున సీనియర్ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదించారు. ట్రస్ట్ ద్వారా నిధుల వినియోగం అవుతోందని, ట్రస్టీలు ఒక్క రూపాయి తీసుకోలేదని, మధ్యవర్తిత్వ కేంద్రం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు.