కోదాడ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా కేంద్రంలో ఈనెల 30, డిసెంబర్ 1వ తేదీన జరిగే ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఐ ఎ ఎల్2 వ రాష్ట్ర మహాసభలలో కోదాడ నుండి అధిక సంఖ్యలో లాయర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ ఆర్ కే మూర్తి, ఐ ఎ ఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావులు కోరారు. బుధవారం కోదాడ కోర్టు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో వారు రాష్ట్ర మహాసభల పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో లాయర్ల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం ఐ ఎ ఎల్ కృషి చేస్తున్నదని తెలిపారు.
న్యాయవాద వృత్తిలో ఎదురవుతున్న సవాళ్లు, లాయర్లపై జరుగుతున్న దాడులు, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, నూతన చట్టాలపై రాష్ట్ర మహాసభల్లో చర్చించి తీర్మానాలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో కోదాడ బార్ అసోసియేషన్ నుండి అధిక సంఖ్యలో లాయర్లు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎలక సుధాకర్ రెడ్డి, కాకర్ల వెంకటేశ్వర రావు, పాలేటి నాగేశ్వర రావు, ఉసిరికాయల రవికుమార్, సంఘం జిల్లా బాధ్యులు దొడ్డ శ్రీధర్, గోవర్ధన్, కోదాడ కమిటీ ఉపాధ్యక్షుడు కోడూరు వెంకటేశ్వర రావు, తాటి మురళీ, ప్రధాన కార్యదర్శి సెగ్గెమ్ వెంకటాచలం, సహాయ కార్యదర్శి ఆవుల మల్లికార్జున రావు, కోశాధికారి పెద్దబ్బాయి, కార్యవర్గ సభ్యులు సామా నవీన్, కానుగ మురళీ, సుల్తాన్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.