17-04-2025 12:00:00 AM
ప్రియదర్శి టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రూపా కొడవాయూర్ హీరోయిన్. ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ.. ‘ఇంద్రగంటితో పనిచేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది.
ఈ టీమ్‌తో మరోసారి పనిచేయాలనే కోరిక కలిగింది’ అన్నారు. హీరోయిన్ రూపా మాట్లాడుతూ.. ‘నేను స్వతహాగా జాతకాలు నమ్మను. కానీ ఈ సినిమా చేసిన తర్వాత జాతకాలను నమ్మడం మొదలుపెట్టాను. డాక్టర్‌గా పనిచేసుకొందామనుకుంటే.. నన్ను యాక్టర్ చేశారు. సారంగపాణి జాతకంతో ప్రియదర్శి హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు. దర్శకుడు ఇంద్రగంటి బంగారం లాంటివారు’ అని తెలిపారు.
దర్శకుడు మోహనకృష్ణ మాట్లాడుతూ.. ‘కేవలం తెలుగువారు నటించిన అచ్చ తెలుగు సినిమా ఇది. మిమ్మల్ని అన్నిరకాలుగా మెప్పిస్తుంది’ అని చెప్పారు. నిర్మాత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా అవుట్‌పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నా. ఈ సినిమా హిట్ కావడం గ్యారెంటీ’ అన్నారు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషించిన వెన్నెల కిషోర్, వైవా హర్ష, సాయిశ్రీనివాస్ వడ్లమాని, ఆదిత్య మ్యూజిక్ ప్రతినిధి నిరంజన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.