calender_icon.png 16 January, 2025 | 8:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్ల కోసమే పనిచేస్తా.. కానీ..

03-09-2024 03:17:37 AM

బాలీవుడ్ బ్యూటీ, లైగర్ ఫేం అనన్యా పాండే ‘కాల్ మీ బే’ అనే వెబ్ సిరీస్‌తో మొదటిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. విమర్శలు, వ్యక్తిగత జీవితంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. అభిమానులు, సొసైటీని ద్రుష్టిలో ఉంచుకొని నేను సినిమాలు చేస్తా. వాళ్ల కోసం రిస్క్ తీసుకుంటా. భిన్నంగా పనిచేయడానికి ట్రై చేస్తా. ఫీడ్ బ్యాక్ నాకు చాలా ముఖ్యం.

అయితే పని విషయానికి వస్తే విమర్శలు పట్టించుకోను. వ్యక్తిగత జీవితం వేరు, సినిమాలు వేరు. పనిచేసుకుంటూ పోవడమే నాకు తెలుసు” అని అన్నారు. అనన్యా పాండే ప్రధాన పాత్రలో నటించిన ‘కాల్ మీ బే’ సెప్టెంబర్ 6న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. ఇందులో గుర్ఫతే పిర్జాదా, నీల్ నాయర్, విహాన్ సమత్, వరుణ్ సూద్, వీర్ దాస్ తదితరులు నటించారు. వీటితో పాటు విక్రమాదిత్య మోత్వానేతో ’సీటీఆర్‌ఎల్’ అనే సినిమా కూడా అనన్య చేతిలో ఉంది. ’ఖో గయే హమ్ కహాన్’లో ఆమె నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.