అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి
కరీంనగర్, నవంబర్ 1 (విజయక్రాంతి): రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను ఎమ్మెల్సీగా ఆశీర్వదించి గెలిపిస్తే సేవకుడిగా పని చేస్తానని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి అన్నారు. కరీంనగర్‌ంలోని పలు పాఠశాలల్లో శుక్రవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నాలుగు జిల్లాల వ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయించేందుకు కృషి చేస్తానన్నారు.
ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ డీఏపై ప్రభుత్వంతో మాట్లాడి విడుదల చేయిస్తానని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యుర్థుల కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తానన్నారు. ఈ నెల 6వ తేదీలోపు ప్రతి పట్టభద్రుడు విధిగా ఓటు హక్కును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.