calender_icon.png 27 December, 2024 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎంకేను ఓడించే వరకు చెప్పులు వేసుకోను

27-12-2024 01:57:01 AM

  • 48 గంటలపాటు ఉపవాస దీక్ష
  • తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రకటన

కోయంబత్తూరు, డిసెంబర్ 26: అన్నా యూనివర్సిటీ విద్యార్థిపై లైంగిక దాడి నేపథ్యంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై సంచలన శపథం చేశారు. తమిళనాడులో డీఎంకే అధికారం కోల్పేయే అంతవరకు తాను చెప్పులు ధరించబోనని ప్రతిజ్ఞ చేశా రు. గురువారం కోయంబత్తూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ డీఎంకే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తాను చెప్పులు ధరించనని, చెప్పులు లేకుండానే నడుస్తానని ప్రకటించారు.

ఎన్నికల్లో విజయం సాధించడానికి రూపాయి కూడా పంచకుండానే ఎన్నకలకు వెళ్తామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించే వరకు తాను చెప్పులు ధరించనని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూరులోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు భరించి మురుగన్‌కు మొక్కు చెల్లించుకుంటానని చెప్పారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్ ఆలయాలను దర్శించుకునేందు కు 48 గంటలపాటు ఉపవాస దీక్ష చేపడతానని ప్రకటించారు.

కాగా చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థిపై జరిగిన లైంగికదాడికి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ లీక్ కావడంపై ఆయన మండిపడ్డారు. బాధితురాలి వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లేలా పోలీసుల తీరు ఉందన్నారు. డీఎంకేతో సం బంధాలు ఉండడంతోనే నిందితుడు జ్ఞానశేఖర్‌పై ఇంతవరకు రౌడీషీట్ తెరవలేదని ఆయన ఆరోపించారు. ఈ కేసును నీరుగా ర్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.