calender_icon.png 20 March, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవార్ల దయతో గెలిచా.. కరీంనగర్ కు రుణపడి ఉంటా..

20-03-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ  అంజిరెడ్డి

కరీంనగర్, మార్చి 19 (విజయ క్రాంతి): ముగ్గురు కొలువైన దివ్య క్షేత్రం మహాశక్తి అమ్మవార్ల దయ, దీవెనలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించానని, కరీంనగర్ కు రుణపడి ఉంటానని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన మహాశక్తి దేవాలయ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ  ముఖ్యంగా తన విజయం కోసం అహర్నిశలు కృషిచేసిన బిజెపి నాయకులు,  కార్యకర్తలు, వివిధ క్షేత్రాల బాధ్యులు , పట్టభద్రులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

ఎమ్మెల్సీగా తన బాధ్యతను నెరవేర్చడానికి తగిన కార్యాచరణ తో ముందు కొనసాగుతానని తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారం కోసం శాసన మండలిలో గళం విప్పుతానని, వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతర కృషి చేస్తానన్నారు. ఆయన వెంట బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ కార్పొరేటర్ కోలగని శ్రీనివాస్, బండ రమణారెడ్డి, నరహరి లక్ష్మారెడ్డి, తదితరులు ఉన్నారు.