calender_icon.png 7 November, 2024 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నా

06-11-2024 12:00:00 AM

సినీ నటి కస్తూరి తమిళనాడులో ఓ వేదికపై తెలుగువా రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. దీం తో ఆమెపై వ్యతిరేకత రావడం తో తాను తెలుగు ప్రజల గురిం చి తప్పుగా మాట్లాడలేదంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు. అయినా ఆమెపై ఎదురుదాడి ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ఆమె క్షమాపణ చెబుతూ ఓ లేఖను విడుదల చేశారు. ‘నేను కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించాను.

నేను నిజమైన జాతీయవాదిని. ఎప్పుడూ ప్రాంతాలను విడగొట్టి చూడలేదు. నా జీవితంలో తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండటం నా అదృష్టం. నేను నాయకర్ రాజులు, కట్టబొమ్మ నాయక (వీరపాండ్య కట్టబ్రహ్మన), త్యాగరాజు కీర్తనల గురించి తెలుసుకుంటూ పెరిగాను. తెలుగులో నా సినీ కెరీర్ ఎంతో అద్భుతంగా సాగుతున్నది. తెలుగు ప్రజలు నాకు పేరుతోపాటు కీర్తి, ప్రేమ, కుటుంబాన్ని అందించారు.

నేను మాట్లాడింది కొందరు వ్యక్తుల గురించేనని గ్రహించగలరు. తెలుగు సమాజం మొత్తాన్ని ఉద్దేశించి నేను మాట్లాడలేదు. నా తెలుగు కుటుంబాన్ని బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. అనుకోనివిధంగా జరిగిన ఈ ఘటనకు నన్ను క్షమించండి. సర్వతోముఖ స్నేహం దృష్ట్యా నేను 3 నవంబర్ 2024న నా ప్రసంగంలో తెలుగుకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలను నేను ఉపసంహరించుకుంటున్నాను.

ఈ వివాదం.. నేను ఆ ప్రసంగంలో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలన్నింటినీ పక్కకు నెట్టేసింది. తమిళనాడులోని తెలుగు సోదరులందరూ పరువు కోసం జరిగే పోరాటంలో తమిళ బ్రాహ్మణులకు మద్దతుగా నిలవాలని నేను కోరుతున్నాను’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 3న కస్తూరి తెలుగు వారి గురించి ‘సుమారు 300 ఏళ్ల క్రితం రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు తెలుగు వారు తమిళనాడుకు వచ్చా రు.

అలా వచ్చిన వారం తా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా రు. అలా అయితే, ఇక్కడికి ఎప్పుడో వచ్చిన బ్రాహ్మణులను తమిళు లు కాదని చెప్పడానికి తెలుగువారు ఎవరు?’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇందుకు క్షమాపణలు కోరుతూ రాసిన లేఖను కస్తూరి మంగళవారం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.